దాతృత్వానికి ప్రతీక గార్మి షరీఫ్ వేడుకలు
కృష్ణా: స్థానిక ఆటోనగర్ మూడో లైన్‌లో ఆదివారం గార్మి షరీఫ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. పవిత్ర జెండాల చెట్టు వద్ద ప్రార్థనలు చేసిన ఆయనను మైనారిటీ పెద్దలు ముస్లిం సాంప్రదాయం ప్రకారం సత్కరించారు. గార్మి షరీఫ్ వేడుకలు దాతృత్వానికి ప్రతీక అని, వాటిలో భక్తిశ్రద్ధలతో పాల్గొనడం సంతోషకరమని ఎమ్మెల్యే రాము అన్నారు.