VIDEO: తుంగభద్ర డ్యామ్‌కు కొత్త క్రస్ట్ గేట్లు
KRNL: తుంగభద్ర డ్యామ్‌కు రూ.52 కోట్ల వ్యయంతో 33 కొత్త క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేయాలని తుంగభద్ర బోర్డు ఇంజినీర్లు నిర్ణయించారు. గత ఆగస్టులో 19వ గేటు కొట్టుకుపోగా, దాని స్థానంలో తాత్కాలిక గేటు పెట్టారు. నిపుణుల సూచన మేరకు డ్యామ్‌లోని మొత్తం 33 పాత గేట్లను మార్చనున్నారు. పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు.