VIDEO: కోతుల భయం… చింపాంజీ వేషంతో తరిమికొట్టే ప్రయత్నం

VIDEO: కోతుల భయం… చింపాంజీ వేషంతో తరిమికొట్టే ప్రయత్నం

JN: స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ గ్రామంలో కోతుల బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు, పెద్దలను కోతులు కరిచిన ఘటనలతో గ్రామస్థులు బయటకు రావడానికి జంకుతున్నారు. ఈ సమస్యను తగ్గించేందుకు శుక్రవారం గ్రామపంచాయతీ వినూత్న చర్యలు చేపట్టింది. పంచాయతీ కార్మికుడికి చింపాంజీ వేషం వేయించి ఊరంతా తిప్పుతూ కోతులను తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.