VIDEO: రామాయంపేటలో అధ్యయనోత్సవాలు ఆరంభం
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని పాండా చెరువు కట్ట శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఆలయ ప్రాంగణంలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునుంచే విష్ణు సహస్ర పారాయణం, ద్రవిడ వేద పారాయణం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు.