తల్లిదండ్రుల పోషణ పిల్లల బాధ్యత: కలెక్టర్
PDPL: జిల్లాలో వృద్ధుల ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం ఇప్పటి వరకు 166 కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు. వృద్ధులు తమ ఫిర్యాదులను సంబంధిత ఆర్డీవో వద్ద నమోదు చేయాలని సూచిస్తూ, ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.