పిడుగు పడి రెండు ఎద్దులు మృతి

పిడుగు పడి రెండు ఎద్దులు మృతి

NGKL: ఊర్కొండ మండలం బాల్యలోక్య తండాలో పిడుగుపడి రెండు ఎద్దులు మృతి చెందాయి. మంగళవారం సాయంత్రం పొలంలో మేత మేస్తుండగా కురిసిన వర్షానికి పిడుగు పడటంతో చాంద్య నాయక్ అనే రైతుకు చెందిన ఎద్దులు అక్కడికక్కడే చనిపోయాయి. దీంతో సుమారు రూ. 1.50 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నారు.