థర్మల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా నిరసనలు
SKLM: బూర్జ మండలం అడ్డూరి పేట గ్రామంలో ప్రతిపాదిత థర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు, రైతులు, గిరిజనులు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దానికి సంబంధించిన పత్రాలను ప్రజలు దహనం చేశారు. థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో కోశాధికారి రవికాంత్, కమిటీ అధ్యక్షులు సురేష్ దొర పాల్గొన్నారు.