'విద్య అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇచ్చిన వ్యక్తి వెంకటరామిరెడ్డి'

విద్య అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇచ్చిన వ్యక్తి రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి అని మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. వెంకటరామిరెడ్డి జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.