‘కష్టపడి చదివితేనే ఉద్యోగాలు’

KNR: క్రమం తప్పకుండా కాలేజీకి వస్తూ.. కష్టపడి చదివితేనే ఉద్యోగాలు వస్తాయని శ్రీ చైతన్య కళాశాలల ఛైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కళాశాలలో జరిగిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కళాశాలలో కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డైరెక్టర్ నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.