VIDEO: కామారెడ్డిలో ‘హైడ్రా’ ఆపరేషన్ పెట్టండి: కవిత

VIDEO: కామారెడ్డిలో ‘హైడ్రా’ ఆపరేషన్ పెట్టండి: కవిత

కామారెడ్డిలో వరదలు ఎందుకు వచ్చాయో అందరికీ తెలుసని జాగృతి చీఫ్ కవిత అన్నారు. వరదలు, బురదకు కారణమైన వ్యక్తులు మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌లో ఉండి, ఇప్పుడు కాంగ్రెస్‌‌లోకి మారారన్నారు. కామారెడ్డిలో 'హైడ్రా' తరహా వ్యవహారం పెడితే, ఇక్కడ ఉన్న చెత్తాచెదారం, అక్రమాలు అంతా సాఫ్ అవుతుందేమోనని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో CM రేవంత్ ఆలోచన చేయాలని ఆమె కోరారు.