కొవ్వూరులో గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే
E.G: కొవ్వూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇవాళ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సమస్యలతో విచ్చేసిన ప్రజల నుంచి 12 అర్జీలను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులతో వారి సమస్యలపై మాట్లాడి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.