ఇంటర్వ్యూలను పర్యవేక్షిస్తున్న గుమ్మడి సంధ్యారాణి
ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ నియామకం కోసం ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో కూడా ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ నియామక ప్రక్రియను మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.