VIDEO: సీతానగరంలో కోతుల బీభత్సం
E.G: సీతానగరం మండల కేంద్రంతో పాటు రఘుదేవపురం, రాపాక తదితర గ్రామాల్లో కోతుల సంచారం పెరిగి జనం హడలెత్తిపోతున్నారు. ఇళ్లపై పడుతూ మామిడి తోటలను ధ్వంసం చేయడమే కాకుండా, గ్రామస్థులపై దాడులకు తెగబడుతున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడద నుంచి తమను రక్షించాలని, అధికారులు తక్షణమే స్పందించి వాటిని పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.