జాతీయ కరాటే పోటీలకు పెద్దాపురం విద్యార్థులు

KKD: హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో ఈనెల 27 నుంచి జరిగే జాతీయ స్థాయి కరాటే పోటీలకు పెద్దాపురం విద్యార్థులు ఎంపికయ్యారు. పెద్దాపురం చిల్డ్రన్ క్లబ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఇటీవల తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో ఘనవిజయం సాధించడంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. దీంతో వారిని పలువురు అభినందించారు.