‘కాంగ్రెస్ గెలవాలంటే నెహ్రూ కుటుంబాన్ని వదలాలి’

‘కాంగ్రెస్ గెలవాలంటే నెహ్రూ కుటుంబాన్ని వదలాలి’

బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. 'కాంగ్రెస్ పార్టీ గనుక నెహ్రూ కుటుంబాన్ని వదిలించుకోకపోతే, వారి రాజకీయ ఎదుగుదల అసాధ్యం' అని స్పష్టంగా పేర్కొన్నారు. నాయకత్వ మార్పు జరగకపోతే ఆ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పారు. దేశమంతటా కాంగ్రెస్ వరుస పరాజయాలు చవిచూస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.