బీసీ గణనకు డెడికేటెడ్ కమిషన్ నోటిఫికేషన్
PPM: వెనుకబడిన తరగతుల (BC)సామాజిక, ఆర్థిక స్థితిగతుల అధ్యయనం కోసం ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలైందని కలెక్టర్ తెలిపారు. రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన కమిషన్ పని చేస్తుందని, సుప్రీంకోర్టు సూచించిన ట్రిపుల్ టెస్ట్ ప్రకారం అధ్యయనం చేపడుతుందని చెప్పారు. ఆసక్తి గల వ్యక్తులు, సంఘాలు తమ వినతులు, గణాంకాలను ఏప్రిల్ 30లోగా కమిషన్‌కు సమర్పించాలన్నారు.