పార్థసారధికి మంత్రి పదవి రావడంతో నూజివీడులో స్వీట్లు పంపిణీ

కృష్ణా: నూజివీడు పట్టణంలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో నూజివీడు నియోజకవర్గం సర్పంచుల సంఘం అధ్యక్షులు కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారధికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా గురువారం స్వీట్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ పాలన ఉంటుందన్నారు. నూజివీడు నియోజకవర్గాన్ని పార్థసారథి సారధ్యంలో అభివృద్ధి చేస్తామన్నారు.