నూకాంబిక జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
AKP: నూకాంబిక అమ్మవారి జాతర సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమశ్రీ తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం విశాఖ నుంచి ఐదు, చోడవరం, మాడుగుల నుంచి మూడు, విజయనగరం, సబ్బవరం నుంచి మూడు బస్సులు వేస్తున్నట్లు తెలిపారు. అలాగే నర్సీపట్నం, పాయకరావుపేట, దేవరాపల్లి నుంచి ఒక్కొక్క బస్సు నడుపుతామన్నారు.