'మున్సిపల్ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయం సాధించాలి'

కోనసీమ: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయి విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కష్టించి పని చేయాలని రాయవరం మండల మాజీ వైస్ ఎంపీపీ, మండపేట 28వ వార్డు టీడీపీ అబ్జర్వర్ దేవు వెంకటరాజు అన్నారు. మండపేట సత్యశ్రీ రోడ్డులోని దుర్గమ్మ గుడి వద్ద నిర్వహించిన వార్డు ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.