రాజమండ్రి-విశాఖ మెమూ రైళ్లు 3 రోజులు రద్దు

రాజమండ్రి-విశాఖ మెమూ రైళ్లు  3 రోజులు రద్దు

EG: విశాఖపట్నం డివిజన్ దువ్వాడ తాడి సెక్షన్‌లో ట్రాక్ రిపేర్లు చేయనున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 26, 28, 30వ తేదీల్లో జిల్లా మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని 2 నెలల ముందుగానే ఈ విషయం ప్రకటించారు. రాజమండ్రి-విశాఖ మెమూ(67285) రైళ్లను ఆ తేదీల్లో రద్దు చేశారు.