VIDEO: స్క్రాప్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం
విశాఖ కొత్తరోడ్డు సమీపంలో ఉన్న స్క్రాప్ గోడౌన్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో ప్రాంతం అంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. అగ్నిజ్వాలలు భారీగా వ్యాపిస్తూ ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటన స్థలానికి అతి సమీపంలోనే ఒక పెట్రోల్ బంక్ ఉండటం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.