పోలీస్ సిబ్బందికి మెగా హెల్త్ క్యాంప్
నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది, కుటుంబాల కోసం భారీ మెగా హెల్త్ క్యాంప్‌ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అపోలో, మెడికవర్, రినోవా తదితర ఆసుపత్రుల వైద్యులు పాల్గొని BP, షుగర్, ECG, 2D ఎకో, ఎక్స్‌రే తదితర పరీక్షలు నిర్వహించారు. విధుల ఒత్తిడిలో ఆరోగ్యం కాపాడుకోవాలంటే వ్యాయామం, నడక, యోగా తప్పనిసరి అని ఎస్పీ సూచించారు.