VIDEO: దంపూర్‌లో మొక్కజొన్న పంట దగ్ధం

VIDEO: దంపూర్‌లో మొక్కజొన్న పంట దగ్ధం

ADB: గుడిహత్నూర్ మండలం దంపూర్ గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ఎకరం మొక్కజొన్న పంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన రాథోడ్ ఫిరాజి మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే పంట పూర్తిగా కాలిపోయింది. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలని రైతు వేడుకున్నాడు.