పహల్గామ్ ఘటనపై వ్యాఖ్యలు.. సింగర్పై కేసు

పహల్గామ్ ఘటనపై సింగర్ సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు చుట్టుకున్నాయి. ఆయన వ్యాఖ్యలు కన్నడీగుల మనోభావాలను దెబ్బతీశాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకున్న కర్ణాటక పోలీసులు సోనూపై కేసు నమోదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు భాషాపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొన్నారు.