కుస్తీ పోటీలో గాయపడిన వ్యక్తి మృతి
NZB: నవీపేట(M) అభంగపట్నంలో గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక పాఠశాలలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న రెంజల్(M) బాగేపల్లికి చెందిన మల్లయోధుడు ఏ.లక్ష్మణ్ మృతి చెందాడు. కుస్తీ పోటీ సందర్భంగా మరో మల్లయోధుడితో పోటీ పడగా మెడకు తీవ్ర గాయమైంది. అతడిని వెంటనే స్థానికులు 108లో ఆసుపత్రికి తరలించగా, ఈ రోజు HYDలో చిక్సిత పోందుతూ మృతి చెందాడు.