త్వరలో చేప పిల్లల పంపిణీ: కడియం శ్రీహరి

త్వరలో చేప పిల్లల పంపిణీ: కడియం శ్రీహరి

TG: త్వరలో చెరువులో చేప పిల్లలను వదిలే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మాజీ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మత్స్యకారులు నెలకు రూ.10వేలకు పైగా సంపాదించే స్థాయికి చేరుకోవడం సంతోషకరమని చెప్పారు. చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తూ ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోందన్నారు. ఘనపూర్ పట్టణ అభివృద్ధికి CM 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు.