రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది: ఆడే గజేందర్

రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది: ఆడే గజేందర్

ADB: భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరిగిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ పేర్కొన్నారు. నేరడిగొండ మండలంలోని కుప్టి గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. వ్యవసాయ పొలాల్లో రైతులను కలిసి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.