నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
W.G: జక్కరం 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో ఆర్.డీ.ఎస్.ఎస్. స్కీం పనుల్లో భాగంగా టవర్ల నిర్మాణం నిమిత్తం బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు జక్కరం, ఆనందపురం, ఎల్.ఎన్.పురం, వాండ్రం గ్రామాలలో సరఫరా నిలిచిపోతుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.