కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ నాయకులు
SRPT: ఆత్మకూరు(ఎస్ )మండలంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆదివారం సాయంత్రం ఆత్మకూరు మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మండల అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ నగేష్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.