'జనగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి'

'జనగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి'

JGL: జనగణన- 2027 కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలో ఎన్యుమారేటర్లు, సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం వారు పరిశీలించారు. జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమని, కచ్చితంగా గణాంకాలు సేకరించడం ద్వారా ప్రభుత్వ పథకాల రూపకల్పన, అమలు సులభం అవుతుందన్నారు.