నవోదయం 2.0 ప్రగతిపై సమీక్ష సమావేశం

నవోదయం 2.0 ప్రగతిపై సమీక్ష సమావేశం

శ్రీకాకుళం: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి. శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం సోంపేట ఎక్సైజ్ స్టేషన్ తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవోదయం 2.0 ప్రగతిపై ఎక్సైజ్ సీఐ కె. బేబీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. రికార్డులను పరిశీలించి నేర సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలను జారీచేశారు. గ్రామ దత్తత అధికారులకు సూచనలు అందజేశారు.