'విద్యార్థులు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి'

'విద్యార్థులు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి'

NLG: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని డిండి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో బుధవారం సైబర్ క్రైమ్‌పై విద్యార్థులకు డిండి పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బాలకృష్ణ, సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుందో, దాని నుంచి ఎలా రక్షించుకోవాలో వివరించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శిరీషతో పాటు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.