అటవీ అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న మంత్రి సురేఖ

WGL: జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంత్రి కొండా సురేఖ HYDలోని నెహ్రూ జూ పార్కులోని స్మారక చిహ్నం వద్ద ఉన్నతాధికారులతో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. అటవీ శాఖ పోలీసులకు, రాష్ట్ర పోలీసులకు లభించే సౌకర్యాలను, ప్రయోజనాలను అందిచడానికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు. అటవీ భూముల ఆక్రమణలను అదుపుచేయడంలో ఫారెస్ట్ పోలీసుల పాత్ర పోషిస్తున్నారని మంత్రి వివరించారు.