క్రీడాకారిణి మైదిలిని సత్కరించిన కావలి ఎమ్మెల్యే
NLR: అల్లూరు మండలం పల్లెపాడుకు చెందిన బొమ్మల మైధిలి దివ్యాంగురాలు. అయినప్పటికీ విశేష ప్రతిభతో క్రికెట్‌లో రాణిస్తోంది. హర్యానాలో మార్చి 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన టీ10 నేషనల్ క్రికెట్ ఛాంపియన్ షిప్‌లో ఏపీ జట్టు తరఫున ఆమె ఆడింది. అక్కడ కూడా ప్రతిభ చూపడంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆమెను సన్మానించి అభినందించారు.