విజయవాడ టెర్రర్ లింక్.. ఐదు రోజులు కస్టడీ
AP: విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 20 వరకు నిందితుల రిమాండ్ పొడిగిస్తూ.. కోర్టు ఉత్తర్వులిచ్చింది. నిందితులను విచారించేందుకు ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నెల 9 నుంచి 13 వరకు కస్టడీ విచారణ జరగనుంది. కాగా, ఈ కేసులో నిందితులను ఇప్పటికే రెండు సార్లు అధికారులు విచారించిన విషయం తెలిసిందే.