ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు: బొబ్బ నవతారెడ్డి
RR: మహిళా దినోత్సవ ఫ్లెక్సీలను రాజకీయ కక్షతో తొలగించడం దారుణమని, ప్రజా సమస్యల కంటే విపక్షాలపై కక్షసాధింపుపైనే ప్రజాప్రతినిధికి మక్కువ ఎక్కువని బొబ్బ నవతారెడ్డి విమర్శించారు. ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమను పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆమె మండిపడ్డారు.