' రైతులు ఈ-పంట నమోదు చేయించుకోండి'

సత్యసాయి: రొద్దం మండలంలో పంట వేసిన రైతులు e-పంట నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాజేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కంది, మొక్క జొన్న, పత్తి మొదలగు పంటలు, ఇంకా ఇతర వ్యవసాయ పంటలు వేసిన రైతులు తమ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, పట్టాదార్ పాసుబుక్ కాపీలతో సచివాలయ పరిధిలోని RSK సిబ్బందిని సంప్రదించి నమోదు చేసుకోవాలన్నారు.