నేడు తుమ్మెనపేటకు విరోష్ దంపతులు
NGKL: ఇటీవల వివాహం చేసుకున్న సినీ హీరో విజయ్‌దేవరకొండ, రష్మిక సోమవారం బల్మూరు మండలం తుమ్మెనపేట గ్రామానికి వస్తున్నట్లు కుటుంబ సభ్యులు రామ్మోహన్‌రావు తెలిపారు. వారి ఫామ్‌హౌస్‌లో సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తొలిసారిగా ఈ దంపతులు స్వగ్రామానికి వస్తుండటంతో కార్యక్రమానికి సుమారు 5 వేల మంది రానున్నట్లు తెలిపారు.