నూతన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుని సన్మానించిన మంత్రి
JGL: జగిత్యాల జిల్లా నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నియమించిన సీనియర్ నాయకుడు గజేంగి నందయ్యని అభినందిస్తూ జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరైయ్యారు. నూతన జిల్లా అధ్యక్షుడైన నందయ్యను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.