వల్లూరులో మండల స్థాయి సైన్స్ ఫెయిర్
KDP: వల్లూరు ఉన్నత పాఠశాలలో బుధవారం మండల స్థాయి సైన్స్ ఫెయిర్ జరిగింది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణం,ఆరోగ్యం,వ్యవసాయం, సాంకేతికత వంటి అంశాలపై విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇలాంటి ప్రదర్శనలు పరిశోధనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తాయని HM తెలిపారు.