మొక్కల ప్రేమికుడికి ప్రపంచ రికార్డు
BDK: పర్యావరణ పరిరక్షణలో చుంచుపల్లి మండలానికి చెందిన విశ్వామిత్ర చౌహాన్ అరుదైన గుర్తింపు సాధించారు. ప్రతిరోజూ మొక్కలు నాటడాన్ని సంకల్పంగా పెట్టుకున్న ఆయన.. నేటికి 1199 మొక్కలు నాటి 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు సంపాదించాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రిటిష్ పార్లమెంట్ మాజీ సభ్యుడు వీరేంద్ర శర్మ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.