అంగరంగ వైభవంగా శ్రీరాముని పట్టాభిషేకం

అంగరంగ వైభవంగా శ్రీరాముని పట్టాభిషేకం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి పట్టాభిషేక మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకు విచ్చేసిన భక్తుల సమక్షంలో జయ జయ నీరాజనాల మధ్య ఆ రామచంద్రుడికి అర్చకులు సమస్త నదీ జలాలతో అభిషేకం చేశారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొని సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరావు, MP బలరాం నాయక్, MLA వెంకట్రావు హాజరై ఈ పట్టాభిషేకాన్ని తిలకించారు.