తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ నాయకత్వమే రక్ష: రాజయ్య

HNK: వేలేరు మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్థానిక బీఆర్ఎస్ నేతలతో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని, రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండాకు అండగా నిలవాలని ఆయన కోరారు.