బంగారు కడ్డీ ఆశ చూపి.. మహిళకు టోకరా
VKB: ఒంటిపై ధరించిన నగలు ఇస్తే 12 తులాల బంగారు కడ్డీ ఇస్తామని గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను బురిడీ కొట్టించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధారూర్ మండల రుద్రారం గ్రామానికి చెందిన కంది లక్ష్మి సంతకు వచ్చింది. కొంత మంది ఆమెను నమ్మించి ఆమె దగ్గర ఉన్న తులంన్నర బంగారాన్ని దుండగులు తీసుకెళ్లారు. ఈ మేరకు ఆమె ధారూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.