రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు
BPT: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ 19 పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేసేందుకు తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో పోలీసులు, నేషనల్ హైవే, మోటార్ వెహికల్ సిబ్బంది, వాలంటీర్లు ఉంటారు. ఈ బృందాలకు డీపీఓలో శిక్షణ ఇచ్చారు. పెనుమూడి, చీరాల, మేదరమెట్ల వంటి కీలక ప్రాంతాలలో ఈ బృందాలు పని చేస్తాయి.