నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు: CI

కడప: నాటు సారా తయారుచేసి విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ అన్నారు. సిద్దవటం మండల కేంద్రంలోని స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. నాటుసారా అనేది చట్టారీత్యా నేరమన్నారు. సారా సేవిస్తే ఎన్నో అనర్ధాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, సారా తయారుచేసి నిలువ ఉంచి విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.