ఆటో కార్మిక సంఘం ఎన్నికల నామినేషన్ దాఖలు
కరీంనగర్ పట్టణంలో ఈనెల 19న జరగనున్న ఆటో కార్మిక సంఘం ఎన్నికల నేపథ్యంలో తాజా మాజీ అధ్యక్షుడు రాజేందర్ జిల్లా అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. గత మూడేళ్లలో సంఘం అభివృద్ధికి కృషి చేశానని, మళ్లీ అవకాశం ఇస్తే మరింత సేవ చేస్తానని ఆయన తెలిపారు. సంఘానికి సొంత భవనం నిర్మాణమే తన లక్ష్యమన్నారు. ఆయనతో పాటు ఇతర అభ్యర్థులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు.