బైక్, టిప్పర్ ఢీ.. ఇద్దరు మృతి
AP: కర్నూలులో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.