మాజీమంత్రి కాకాణిపై సోమిరెడ్డి ఫైర్
AP: దేవుడి గుడిని అభివృద్ధి చేస్తే తప్పు పట్టిన ఘనత వైసీపీ నేత కాకాణికే దక్కుతుందని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. 'రూ.60 కోట్లు విలువచేసే భూములను పాఠశాలలు, ఆసుపత్రులకు ఇచ్చిన చరిత్ర మా కుటుంబానిది. మీ కుటుంబం ఇచ్చిన ఒక్క సెంటు భూమి వివరాలైనా చెప్పగలవా? అత్తగారి భూముల పేరుతో పక్క భూములు ఆక్రమించుకున్న చరిత్ర కాకాణిది' అని విమర్శించారు.