'విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'
MDK: తూప్రాన్ విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి కార్మికులకు మద్దతు తెలిపారు. ఆర్టిజన్ కార్మికులకు APSB నిబంధనల ప్రకారం కన్వర్షన్ ఇవ్వాలని, వారి విద్యా అర్హతలను బట్టి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.